: పాక్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ కు సమన్లు పంపిన భారత్
పాకిస్థాన్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ కు భారత్ సమన్లు పంపింది. సరిహద్దుల వద్ద పాక్ కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతున్న సంగతి తెలిసిందే. నిన్నటి నుంచి సరిహద్దుల్లో పాక్ జరుపుతున్న కాల్పుల్లో ఆరుగురు మృతి చెందారు. దీంతో సరిహద్దుల్లో జరుగుతున్న కాల్పుల ఒప్పంద ఉల్లంఘనను తీవ్రంగా పరిగణించాలని పేర్కొంటూ పాక్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ కు భారత్ సమన్లు పంపింది. కాగా, పాక్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జమ్మూకాశ్మీర్లోని పోరాటానికి తమ దేశం సాయం చేస్తుందని పాక్ హైకమిషనర్ పేర్కొన్న సంగతి తెలిసిందే.