: భూసేకరణ చట్టం ఉపయోగించవద్దు: పవన్ కల్యాణ్ మళ్లీ విజ్ఞప్తి
అమరావతి ప్రాంతంలో రైతుల భూముల సేకరణకు భూసేకరణ చట్టం ప్రయోగిస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతుండడంపై జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా స్పష్టమైన ప్రకటన చేశారు. రెండు, మూడు పంటలు పండే భూములను రైతుల నుంచి లాక్కునేందుకు భూసేకరణ చట్టం అమలు చేయవద్దని పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఇదే తరహా కామెంట్ ను ఆగస్టు 13న కూడా పవన్ కల్యాణ్ చేశారు. ఆ ప్రకటనపై స్పందించిన టీడీపీ నేతలు పవన్ కల్యాణ్ సూచనను పరిగణనలోకి తీసుకుంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అనంతరం భూసేకరణ చట్టం ప్రయోగిస్తామని మంత్రి నారాయణ మళ్లీ పేర్కొనడంపై ఆయన తాజా వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. మరి, దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి!