: నేపాల్ లో నాలుగు నెలల్లో 479 సార్లు భూమి కంపించింది


నేపాల్ లో గత ఏప్రిల్ 25న 7.9 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఆ భూకంపం ధాటికి నేపాల్ మొత్తం అతలాకుతలమవగా, ప్రపంచ దేశాల సాయంతో నెమ్మదిగా కోలుకుంటోంది. ఆనాటి విషాదం తరువాత ఇప్పటి వరకు 479 సార్లు నేపాల్ లో భూప్రకంపనలు సంభవించాయి. నిన్నటి నుంచి నేటి మధ్యాహ్నం వరకు మూడు సార్లు భూమి కంపించింది. ఖాట్మండుకు 110 కిలోమీటర్ల దూరంలోని డోల్ఖా జిల్లాలో 4.8 తీవ్రతతో భూమి కంపించింది. నిన్న తప్లేజ్ గంజ్, డోల్ఖా జిల్లాల్లో ఇదే రీతిన భూమి కంపించిందని అధికారులు వెల్లడించారు. కాగా, ఈ ప్రకంపనల కారణంగా వాటిల్లిన నష్టాన్ని వారు వెల్లడించలేదు.

  • Loading...

More Telugu News