: శభాష్, సైనా!: కేసీఆర్ అభినందన
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో రజత పతకం సాధించిన సైనా నెహ్వాల్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. ఓటమిపాలైనా రజత పతకం వరకు సైనా చేరిన తీరు అద్భుతమని కేసీఆర్ కొనియాడారు. ఈ మేరకు ఆయన సైనా నెహ్వాల్ కు శుభాకాంక్షల సందేశం పంపారు. భారత షట్లర్లు ఇంతవరకు సాధించని ఘనతను సైనా సొంతం చేసుకుందని ఆయన పేర్కొన్నారు. టోర్నీ ఆద్యంతం సైనా అద్భుతంగా రాణించిందని ఆయన పేర్కొన్నారు. అగ్రశ్రేణి క్రీడాకారిణులను దీటుగా ఎదుర్కొన్న సైనా, నెంబర్ వన్ క్రీడాకారిణి మారీన్ కు గట్టి పోటీ ఇచ్చిందని కేసీఆర్ ప్రశంసించారు. కాగా, ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరిగిన వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లో స్పెయిన్ క్రీడాకారిణి మారీన్ చేతిలో సైనా ఓటమి పాలై రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే.