: కోట్లాది అభిమానులను నిరాశ పరుస్తూ ఓడిన సైనా


ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీల్లో కోట్లాది మంది భారతీయులకు నిరాశ ఎదురైంది. నేడు జరిగిన ఫైనల్ పోటీల్లో భారత యువకిరణం, సైనా నెహ్వాల్ ఓడిపోయింది. స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ తో తలపడ్డ సైనా 21-16, 21-19 పాయింట్ల తేడాతో రెండు వరుస సెట్లలో సైనాపై గెలిచి చాంపియన్ షిప్ ను సొంతం చేసుకుంది. ఉత్కంఠ భరితంగా జరిగిన పోరు అనంతరం, ఆమెకు గోల్డ్ మెడల్ దక్కగా, సైనా నెహ్వాల్ సిల్వర్ మెడల్ తో సరిపెట్టుకుంది. అయినప్పటికీ, ఈ పోటీల్లో ఫైనల్స్ కు చేరిన తొలి భారత క్రీడాకారిణిగా సైనా నిలిచి చరిత్ర సృష్టించింది. మారిన్ తనకన్నా బాగా ఆడిందని మ్యాచ్ అనంతరం సైనా నెహ్వాల్ వ్యాఖ్యానించింది.

  • Loading...

More Telugu News