: పొగరాణులకు కీళ్లవాతం తథ్యం


పొగతాగే మగవాళ్లని పొగరాయుళ్లు అంటాం. అదే ఆడవాళ్లయితే.. పొగరాణులు అంటే బాగుంటుంది. పదం బాగానే ఉంటుంది గానీ.. సదరు పొగరాణుల కోసం కొంత కాలం గడిచేసరికెల్లా.. కీళ్ల వాతం పొంచి ఉంటుందిట. సిగరెట్‌ కాల్చే అలవాటు లేని అతివలతో పోలిస్తే.. ఈ పొగరాణులకు కీళ్ల వాతం వచ్చే అవకాశాలు రెండింతలు ఎక్కువని తాజా అధ్యయనం చెబుతోంది.

రోజుకి ఒకటి నుంచి ఏడు సిగరెట్లు ఊదిపారేస్తే.. కీళ్లవాతం వచ్చే ఛాన్సులు 2.31 శాతం ఎక్కువ. 54 నుంచి 89 వరకు వివిధ వయస్సుల్లో ఉన్న 34 వేల మంది మహిళల్ని స్వీడన్‌ పరిశోధకులు తమ అధ్యయనంలో విచారించారు. పైగా.. స్మోకింగ్‌ను ఎంత త్వరగా మానేస్తే కీళ్లవాతం సోకే ప్రమాదం నుంచి అంత త్వరగా బయటపడవచ్చునట కూడా! ఈ విషయాన్ని స్టాక్‌హోంలోని కరోలిన్‌స్కా ఇన్స్‌టిట్యూట్‌ వారు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News