: పంజాబ్ హోం మంత్రి కార్యాలయంపై ఆత్మాహుతి దాడి, నలుగురి మృతి


పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరో దాడికి తెగబడ్డారు. ఈ దఫా ఆత్మాహుతి దాడికి దిగారు. పంజాబ్‌ రాష్ట్ర హోం మంత్రి కార్యాలయంలోకి ప్రవేశించిన ఆత్మాహుతి దళ సభ్యుడొకడు తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. పేలుడు ధాటికి హోం శాఖ భవనం ధ్వంసమైంది. హోంమంత్రికి కూడా తీవ్రగాయాలయ్యాయి. ఆయనను, క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి.

  • Loading...

More Telugu News