: మహేష్... మీ నాన్న 14 సినిమాల్లో అవకాశం ఇప్పించాడు, నువ్వేమైనా ఇప్పించావా?: రాజేంద్రప్రసాద్
'రామరాజ్యంలో భీమరాజు' చిత్రం తరువాత సూపర్ స్టార్ కృష్ణ తనకు 14 చిత్రాల్లో అవకాశాలు ఇప్పించాడని, అందువల్లే తాను సినీ పరిశ్రమలో నిలబడ్డానని రాజేంద్ర ప్రసాద్ గుర్తు చేసుకున్నారు. 'నువ్వేమైనా ఇప్పించావా?' అని మహేష్ ను అడిగిన ఆయన ఓ నవ్వు నవ్వి, 'ఈ విషయమై మళ్లీ మాట్లాడతాను' అన్నాడు. అప్పుడే స్పందించిన మహేష్ 'నేనూ ఇప్పిస్తాలే' అనడం వినిపించింది. ఈ చిత్రానికి 'రామరాజ్యంలో భీమరాజు' పోలికలున్నాయని గుర్తు చేసినందుకు థ్యాంక్యూ వెరీమచ్. శ్రీమంతుడు చిత్రం తెలుగు సినిమాలు మరో మలుపు తిరిగేందుకు ఉపకరిస్తుందని భావిస్తున్నట్టు రాజేంద్ర ప్రసాద్ తెలిపాడు. హీరోయిజం పాజిటివ్ నెస్ కు వచ్చిందని, ఓ చిరుద్యోగి కూడా తన ఊరికి వెళ్లి కనీసం ఓ బోరింగ్ వేయిద్దామని భావించడం, ఈ చిత్రం హిట్టయిందనడానికి నిదర్శనమని అన్నాడు. "ఇప్పుడు మీరు చప్పట్లు కొట్టాలి" అని అడిగి ఆహూతులతో చప్పట్లు కొట్టించాడు. శ్రీమంతుడు చిత్రం విజయోత్సవ సభలో ఈ ఘటన జరిగింది.