: అప్పుడే 'బ్రహ్మోత్సవం' ఒత్తిడి తేవద్దండీ... మీ ప్రశ్నలతో ఇంకో వారం నిద్రపట్టదు: మీడియాకు మహేష్ చురకలు


శ్రీమంతుడు చిత్రం హిట్టయిన ప్రభావం మీ తదుపరి చిత్రం 'బ్రహ్మోత్సవం'పై ఉంటుంది కదా? ఎలా తట్టుకుంటారని ప్రిన్స్ మహేష్ బాబును మీడియా ప్రశ్నించింది. దీనిపై తనదైన శైలిలో స్పందించిన మహేష్ "అప్పుడే మొదలు పెట్టేశారండీ ప్రెజర్... దీన్ని ఎంజాయ్ చేయనీయండి సార్, కొంచంసేపు ప్లీజ్... ప్రజర్ ఏమీ లేదు. కానీ మీరు చెబుతుంటే నేను ఫీల్ అవాల్సి వస్తోంది. దాని గురించి మేము ఆలోచించలేదండి. ఆ... నెక్ట్స్ మంథ్ స్టార్టవుతుంది సినిమా. రైట్ నౌ వుయ్ ఆర్ ఎంజాయింగ్ ది సక్సెస్. లెటజ్ ఎంజాయ్ ది సక్సెస్. రిలీజ్ ముందు టెన్షన్ తో వారం పడుకోలా. ఇప్పుడు హ్యాపీనెస్ తో పడుకోవట్లా. మీ క్వశ్చన్ తో ఇంకో వారం పడుకోను" అంటూ మీడియాకు చురకలంటించారు. కలెక్షన్ల కన్నా తనకు సినిమాను అందరూ చూస్తున్నారన్న సంగతే ఆనందాన్ని కలిగిస్తోందని, ఈ చిత్ర నిర్మాణంలో భాగం కావడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పాడు.

  • Loading...

More Telugu News