: చంద్రబాబు ఇంటి ముందు ధర్నా చేస్తా: రోజా


మహిళా సమస్యలపై పోరాటం చేస్తున్నందున చంద్రబాబు ప్రభుత్వం తన అనుచరులపై తప్పుడు కేసులు బనాయిస్తోందని, వైకాపా నేత, నగరి ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. నగరి మునిసిపల్ చైర్మన్ శాంతకుమారి కుటుంబాన్ని పోలీసులు వేధిస్తున్నారని ఆమె విమర్శించారు. వెంటనే వేధింపులు ఆపకుంటే సీఎం ఇంటిముందు ధర్నా చేస్తానని ఆమె హెచ్చరించారు. సీఎం సొంత జిల్లా చిత్తూరులో పోలీసుల తీరు తీవ్ర ఆక్షేపణీయంగా ఉందని ఆమె దుయ్యబట్టారు. తనపైనా అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. తక్షణం కేసులన్నీ ఎత్తివేయాలని రోజా డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News