: నా మనవడు అలిగాడు: గవర్నర్ నరసింహన్
తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఇచ్చిన విందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ రాకపోవడంతో నరసింహన్ మనవడు అలిగాడట. ఈ విషయాన్ని నరసింహనే స్వయంగా చెప్పారు. "నా మనవడు అలిగిన మాట వాస్తవం. సీఎంలు రాని కారణంగా 'ఎట్ హోం' పార్టీ కళ తప్పిందా?" అని ఆయన మీడియాను ప్రశ్నించారు. వారు రాని కారణాలను మీడియా అన్వేషించరాదని సలహా ఇచ్చారు. వారిద్దరికీ తాను కావాల్సిన వాడినేనని చెప్పుకొచ్చారు. తాను విధుల్లో ఉన్నంత కాలం అందరికీ ఆమోదయోగ్యంగానే ఉంటానని అన్నారు.