: వరుణుడు కరుణించాడు... రైతులు కదిలారు!


తెలుగు రాష్ట్రాలను వరుణ దేవుడు కరుణించాడు. నిన్నటి నుంచి పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతుండటమే ఇందుకు కారణమని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వివరించారు. కాగా, నిన్న మొన్నటి వరకూ చినుకు కోసం ఎదురుచూసిన రైతాంగం మోములో చిరునవ్వు కనిపిస్తోంది. గుంటూరు, నెల్లూరు, కడప, విజయనగరం, శ్రీకాకుళం, మెదక్, నల్గొండ, కరీంనగర్ తదితర జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో రైతులు పొలం పనులకు కదిలారు. హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఈ తెల్లవారుఝాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

  • Loading...

More Telugu News