: రాష్ట్రపతి భవన్ లో 'ఎట్ హోం' కార్యక్రమం... హాజరైన మోదీ, సోనియా
దేశ స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో 'ఎట్ హోం' కార్యక్రమం నిర్వహించారు. దేశ ప్రథమ పౌరుడు ప్రణబ్ ముఖర్జీ నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులు హాజరయ్యారు.