: వరల్డ్ చాంపియన్ షిప్ ఫైనల్లోకి దూసుకెళ్లిన సైనా
భారత సూపర్ షట్లర్ సైనా నెహ్వాల్ ఇండోనేషియాలో జరుగుతున్న వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో దూకుడు కొనసాగిస్తోంది. శనివారం జరిగిన సెమీఫైనల్ పోరులో సైనా 21-17, 21-17తో ఇండోనేషియా క్రీడాకారిణి లిండావేణి ఫనేత్రిపై విజయం సాధించింది. తద్వారా, ఈ టోర్నీ చరిత్రలో ఫైనల్ చేరిన తొలి భారత షట్లర్ గా అవతరించింది. కాగా, టైటిల్ సమరంలో సైనా టాప్ సీడ్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో అమీతుమీ తేల్చుకోనుంది.