: 54 ఏళ్ల తర్వాత క్యూబాలో రెపరెపలాడిన అమెరికా జెండా
దాదాపు 54 ఏళ్ల తర్వాత క్యూబా దేశంలో అమెరికా జాతీయ జెండా రెపరెపలాడింది. క్యూబాలో ఈ రోజు అమెరికా రాయబార కార్యాలయాన్ని తిరిగి ప్రారంభించారు. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీ రాయబార కార్యాలయాన్ని ప్రారంభించారు. దీంతో, ఆ కార్యాలయంపై అమెరికా జెండా ఎగిరింది. గత కొన్ని దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. పోయిన నెలలోనే ఈ రెండు దేశాలు తమ సంబంధాలను పునరుద్ధరించుకున్నాయి.