: రాజమహేంద్రవరంలో అమలాపాల్ సందడి


అందాల సినీ భామ అమలాపాల్ శనివారం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి విచ్చేశారు. ప్రఖ్యాత బంగారు ఆభరణాల విక్రయదారు జోస్ అలుక్కాస్ సంస్థ నూతన దుకాణం ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. దుకాణాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ... రాజమండ్రి రావడం ఇది రెండోసారని తెలిపారు. అంతేగాకుండా, తన లేటెస్ట్ ప్రాజెక్టు వివరాలు మీడియాతో పంచుకున్నారు. ప్రస్తుతం తమిళంలో సూర్యా హీరోగా వస్తున్న సినిమాలో నటిస్తున్నట్టు చెప్పారు. రాజమండ్రికి అమలాపాల్ వస్తుందన్న సమాచారం తెలియడంతో జోస్ అలుక్కాస్ దుకాణం వద్ద భారీ సందోహం నెలకొంది. ఈ దక్షిణాది నటిని చూసేందుకు అభిమానులు పోటెత్తారు.

  • Loading...

More Telugu News