: ప్రధాని మోదీకి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పాక్ పీఎం


భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీకి, దేశ ప్రజలకు పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. సమగ్ర చర్చల ద్వారా ద్వైపాక్షిక అంశాలపై పరిష్కారం కనుగొందామని తన ప్రకటనలో సూచించారు. పరస్పర ప్రయోజనాల నిమిత్తం ఇరు దేశాల మధ్య చెలిమి అవసరం అని అభిప్రాయపడ్డారు. దక్షిణాసియాలో శాంతి, శ్రేయస్సు కోసం ఇది తప్పనిసరి అని కూడా పేర్కొన్నారు. నిన్న (ఆగస్టు 14) పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ పాక్ ప్రధానికి శుభాకాంక్షలు తెలపడం విదితమే.

  • Loading...

More Telugu News