: ఓటుకు నోటు కేసులో సరికొత్త ట్విస్ట్... ఏపీ పోలీసు అధికారులకు కూడా నోటీసులు?
ఇరు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకోబోతోంది. రానున్న రెండు, మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొందరు టీడీపీ నేతలు, పోలీసు అధికారులకు నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఓటుకు నోటు కేసులో నిందితులైన మత్తయ్య, జిమ్మిలకు ఆశ్రయం కల్పించారన్న ఆరోపణలతో వీరికి ఈ నోటీసులు జారీ కానున్నట్టు సమాచారం. మత్తయ్య, జిమ్మిలు దొరక్కుండా సదరు నేతలు, పోలీసు అధికారులు కాపాడుతున్నారనే సమాచారంతో... తెలంగాణ ఏసీబీ ఈ మేరకు నోటీసులు ఇవ్వనుంది. మరోవైపు మత్తయ్య, జిమ్మిలు ఏపీ పోలీసుల వాహనాలలో తిరుగుతున్నారని టీఏసీబీ భావిస్తోంది.