: ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు... జగన్ లేఖకు కేంద్రం రిప్లై
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి మరో షాకిచ్చేలా కేంద్రం కఠిన నిర్ణయమే తీసుకుంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని తేల్చిచెప్పింది. ఏపీ పునర్ విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను అమలు చేశామని తేల్చిచెప్పింది. ఇకపై మీ రాష్ట్రాన్ని పారిశ్రామికంగానే కాక అన్ని రంగాల్లో అభివృద్ది చేసుకోవాల్సిన బాధ్యత మీదేనంటూ కూడా సూచించింది. ఈ మేరకు వైసీపీ అధినేత, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత మొన్న ఢిల్లీలో చేసిన దీక్ష సందర్భంగా తనకు రాసిన లేఖకు కేంద్రం ఘాటుగా స్పందించింది. కేంద్ర వాణిజ్య శాఖ నుంచి జగన్ లేఖకు సమాధానం వచ్చింది. ఈ సమాధానంలో కేంద్రం తన స్పష్టమైన వైఖరిని ప్రకటించినట్లయింది. ఇకపై అన్ని రాష్ట్రాలతో సమానంగానే ఏపీకి సహకరిస్తామని ఆ లేఖలో కేంద్రం స్పష్టం చేసింది.