: సైకిల్ తొక్కండి... లేకపోతే లావైపోతారు: గచ్చిబౌలి చక్ దే ఇండియా రన్ లో ప్రిన్స్ మహేశ్ బాబు
భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాదులో యువత విభిన్న కార్యక్రమాలను నిర్వహిస్తోంది. నగరంలోని గచ్చిబౌలి ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఒక దరికి చేరిన యువత ‘చక్ దే ఇండియా రన్’ పేరిట సైకిల్ రైడింగ్ పోటీలకు తెర లేపారు. 10 కి.మీ, 50 కి.మీ కేటగిరీలుగా రెండు విభాగాల్లో జరుగుతున్న ఈ పోటీలకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో యువత హాజరైంది. ఈ కార్యక్రమానికి తాజా టాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘శ్రీమంతుడు’ టీం కూడా హాజరైంది. చిత్ర హీరో మహేశ్ బాబుతో పాటు సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన జగపతి బాబు, చిత్ర దర్శకుడు కొరటాల శివ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రైడర్లను ఉత్సహపరుస్తూ మహేశ్ బాబు సినీ డైలాగులు వదిలాడు. ‘సైకిల్ తొక్కండి. లేకపోతే లావైపోతారు’ అంటూ అతడు విసిరిన పంచ్ డైలాగులకు యువత మరింత ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు.