: స్వల్ప స్కోరుకే ఔటైన రోహిత్, కోహ్లీ, ధావన్... ఇండియా స్కోరు 60/5


గాలేలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో భారత టాప్ ఆర్డర్ తడబడింది. వికెట్ నష్టానికి 23 పరుగులతో ఈ రోజు (నాలుగో రోజు) బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా... ఇషాంత్ శర్మ (10), రోహిత్ శర్మ (4), విరాట్ కోహ్లీ (3), శిఖర్ ధావన్ (28) వికెట్లను వెంటవెంటనే కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ వీరులు ధావన్, కోహ్లీలు నిరాశ పరిచారు. ప్రస్తుత భారత స్కోరు 5 వికెట్ల నష్టానికి 60 పరుగులు. అజింక్య రహానే (7), సాహా (0) క్రీజులో ఉన్నారు. ఈ టెస్టులో టీమిండియా విజయం సాధించడానికి మరో 116 పరుగులు అవసరం. చేతిలో మరో 5 వికెట్లు ఉన్నాయి.

  • Loading...

More Telugu News