: స్టార్టప్ ఇండియా...స్టాండప్ ఇండియా: ఎర్రకోటపై నినదించిన మోదీ
గతేడాది ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి చేసిన ‘స్వచ్ఛ భారత్’ ప్రసంగం దేశాన్ని ఓ ఊపు ఊపేసింది. ఏడాది గడవగానే స్వచ్ఛ భారత్ ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక తాజాగా నేటి ఉదయం ఎర్రకోటపై రెండోసారి ప్రసంగం చేసిన మోదీ రెండో నినాదాన్ని ఎత్తుకున్నారు. ‘స్టార్టప్ ఇండియా... స్టాండప్ ఇండియా’ పేరిట కొత్త నినాదం వినిపించిన మోదీ, నేడు కూడా ఎర్రకోట వద్దకు చేరిన అశేష జనవాహిని చేత చప్పట్లు కొట్టించారు. ఇక టీవీలో తన ప్రసంగాన్ని చూస్తున్న యావత్తు దేశ ప్రజానీకంలో నూతనోత్తేజాన్ని నింపారు. ఏడాది తర్వాత స్టార్టప్ కంపెనీలు లేని జిల్లా దేశంలో ఉండబోదని మోదీ ప్రకటించారు. నాడు తన స్వచ్చ భారత్ అభియాన్ నినాదాన్ని విపక్షాలు హేళన చేశాయని గుర్తు చేసుకున్న మోదీ, తాజా నినాదం దేశం రూపు రేఖలనే మార్చివేయనుందని ప్రకటించారు.