: మంత్రి నారాయణ జెండా ఎగుర వేస్తుండగా అపశ్రుతి
నెల్లూరులోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అపశ్రుతి దొర్లింది. జాతీయ జెండాను ఏపీ మంత్రి నారాయణ ఎగురవేస్తుండగా... జెండాకు ఉన్న తాడు తెగిపోయింది. దీంతో, మువ్వన్నెల పతాకం ఎగరకుండానే, కిందకు పడిపోయింది. ఊహించని విధంగా జరిగిన ఈ ఘటనతో ఉలిక్కి పడిన అధికారులు, వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. అనంతరం, జెండా పండుగ సజావుగా సాగిపోయింది.