: ‘హోదా’పై కేంద్రం మాట నిలబెట్టుకోవాలని... బాలయ్య డిమాండ్


టాలీవుడ్ అగ్ర నటుడు, హిందూపురం ఎమ్మెల్మే నందమూరి బాలకృష్ణ నేటి ఉదయం తన సొంత నియోజకవర్గంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. హిందూపురంలోని ఎంజీఎం గ్రౌండ్ లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా హామీని కేంద్రం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. హిందూపురం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఆయన ప్రకటించారు. ప్రజలంతా సోదరభావంతో మెలగాలని బాలయ్య పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News