: మోదీ సహకరిస్తారనే నమ్మకం ఉంది... ఏపీని అగ్రగామిగా నిలపడమే లక్ష్యం: చంద్రబాబు


మన పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలతో సమానంగా ఏపీ అభివృద్ధి చెందేంత వరకు విశ్రమించబోమని... ఆ తర్వాత దేశ అభ్యున్నతి కోసం పాటుపడతామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలబెడతామనే నమ్మకం తనకుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి సహకరిస్తారనే నమ్మకం ఉందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలతో పోటీ పడే స్థాయికి చేరుకునేంత వరకు కేంద్రం ఏపీకి సహాయం చేయాలని కోరారు. విశాఖపట్నంలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భయంకర హుదూద్ తుపానును సమర్థవంతంగా ఎదుర్కొన్నామని... ప్రాణ నష్టం జరగకుండా నివారించామని చెప్పారు. 9 రోజులు బస్సులోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించానని తెలిపారు. ఇప్పటి దాకా రూ. 25 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశామని చెప్పారు. రాష్ట్రాన్ని విద్యుత్ కొరత లేని రాష్ట్రంగా తీర్చిదిద్దామని చెప్పారు.

  • Loading...

More Telugu News