: చిన్న చిన్న ఉద్యోగాలకూ ఇంటర్వ్యూలు అవసరమా?... ఎర్రకోటపై ప్రధాని ప్రశ్న
భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్రకోటపై నుంచి ప్రసంగించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. దేశాభివృద్ధి కోసం పౌరులు చేయాల్సిన కృషిని ప్రస్తావించిన ఆయన యువత ఎదుర్కొంటున్న సమస్యలపైనా గళం విప్పారు. చిన్న చిన్న ఉద్యోగాలకు కూడా సుదీర్ఘ ఇంటర్వ్యూలు అవసరమా? అంటూ ఆయన ప్రశ్నించారు. ప్యూన్, క్లర్క్, మెకానిక్ తరహా ఉద్యోగాలకు కూడా దేశంలో జరుగుతున్న ఇంటర్వ్యూ తంతుపై ఆయన నిరసన తెలిపారు. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థి ప్రతిభను అంచనా వేసి ఉద్యోగమివ్వలేమా? అని ఆయన ప్రశ్నించారు. తద్వారా భవిష్యత్తులో ఉద్యోగాల భర్తీలో కీలక సంస్కరణలు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన తేల్చిచెప్పారు.