: ఎర్రకోటపై జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ... హాజరైన అతిరథ మహారథులు
69వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్రకోటపై జాతీయ జెండా రెపరెపలాడింది. ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. తొలుత రాజ్ ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళి అర్పించిన ఆయన నేరుగా ఎర్రకోట చేరుకున్నారు. ఎర్రకోట వద్ద జరిగిన జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ తదితర ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.