: మళ్లీ తగ్గిన పెట్రో ధరలు... అర్ధరాత్రి నుంచే అమల్లోకి!
దేశవ్యాప్తంగా మరోమారు ఇంధన ధరలు తగ్గాయి. పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తూ చమురు సంస్థలు నిన్న సాయంత్రం నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోల్ పై లీటరుకు రూ.1.27, డీజిల్ పై లీటరుకు రూ.1.17 తగ్గిస్తున్నట్లు చమురు రంగ సంస్థలు ప్రకటించాయి. తగ్గిన ధరలు గత అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ నెల 1న ఓసారి పెట్రోల్ ధర తగ్గిన విషయం తెలిసిందే. తాజా తగ్గింపు ఈ నెలలోనే ఇది రెండో దఫా. అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు తగ్గడం, రూపాయి-డాలరు మారకపు విలువ తగ్గిన నేపథ్యంలోనే పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిన్న సాయంత్రం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది.