: ఆర్కే బీచ్ లో చంద్రబాబు, గోల్కొండలో కేసీఆర్... మరికాసేపట్లో జెండా ఆవిష్కరణ


రాష్ట్ర విభజనకు ముందు స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవ వేడుకలు సికింద్రాబాదు పరిధిలోని పరేడ్ గ్రౌండ్స్ లో జరిగేవి. అయితే రాష్ట్ర విభజనతో తెలుగు నేల రెండుగా ముక్కలైంది. పదేళ్ల పాటు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ తన సొంత భూమిలో వేడుకలు నిర్వహించుకునేందుకే ఏపీ సర్కారు మొగ్గు చూపుతోంది. అదే సమయంలో పరేడ్ గ్రౌండ్స్ కంటే మరో వేదిక అయితే బాగుంటుంది కదా అన్న భావనలో తెలంగాణ సర్కారు అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాదులోని గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అక్కడ ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. నేటి ఉదయం 9 గంటల సమయంలో సీఎం కేసీఆర్ అక్కడ జెండా ఎగురవేస్తారు. మరోవైపు గత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను రాయలసీమ ముఖద్వారం కర్నూలులో జరుపుకున్న ఏపీ ప్రభుత్వం ఈ దఫా, విశాఖను ఎంచుకుంది. విశాఖలోని సముద్ర తీరం ఆర్కే బీచ్ లో ఏర్పాట్లు చేసింది. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ ఉదయం 8.55 గంటలకు జెండా ఆవిష్కరించనున్నారు.

  • Loading...

More Telugu News