: సానియా మీర్జాకు 'ఖేల్ రత్న'... రోహిత్ శర్మ, కిదాంబి శ్రీకాంత్ లకు 'అర్జున'


దేశంలో క్రీడాకారులకు ప్రదానం చేసే అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్ రత్నకు టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను ఎంపిక చేసినట్టు కేంద్రం ప్రకటించింది. క్రీడా అవార్డులను ప్రకటిస్తూ కేంద్రం ఈ విషయం తెలిపింది. తనకు 'ఖేల్ రత్న' ప్రకటించారన్న వార్త తెలియగానే సానియా సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవార్డు తనకు స్ఫూర్తి కలిగించిందన్నారు. ప్రతిష్ఠాత్మక పురస్కారం నేపథ్యంలో బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు. ఇక, 17 మంది క్రీడాకారులకు అర్జున అవార్డు ప్రకటించారు. వారిలో టీమిండియా డాషింగ్ క్రికెటర్ రోహిత్ శర్మ కూడా ఉన్నాడు. ఇద్దరు తెలుగు క్రీడాకారులు కూడా అర్జున జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం. బ్యాడ్మింటన్ యువ కెరటం కిదాంబి శ్రీకాంత్, రోలర్ స్కేటర్ అనూప్ కుమార్ యామా ఈ అవార్డుకు ఎంపికయ్యారు. అర్జున అవార్డుకు ఎంపికైన క్రీడాకారుల పూర్తి జాబితా ఇదే... రోహిత్ శర్మ (క్రికెట్), అనూప్ కుమార్ యామా (రోలర్ స్కేటింగ్), పీఆర్ శ్రీజేష్ (హాకీ), కిదాంబి శ్రీకాంత్ (బ్యాడ్మింటన్), అభిలాషా మాత్రే (కబడ్డీ), మన్ జీత్ చిల్లర్ (కబడ్డీ), దీపా కర్మాకర్ (జిమ్నాస్టిక్స్), జీతూరాయ్ (షూటింగ్), సందీప్ కుమార్ (ఆర్చరీ), మన్ దీప్ జంగ్రా (బాక్సింగ్), ఎంఆర్ పూర్వమ్మ (అథ్లెటిక్స్), శరత్ గైక్వాడ్ (పారా సెయిలింగ్), యుమ్నమ్ సంతోయి దేవి (వుషూ), సతీశ్ శివలింగం (వెయిట్ లిఫ్టింగ్), స్వర్ణ్ సింగ్ విర్క్ (రోయింగ్), బజరంగ్ (రెజ్లింగ్), బబిత (రెజ్లింగ్).

  • Loading...

More Telugu News