: కాశ్మీర్ పై పాక్ రాయబారి తీవ్ర వ్యాఖ్యలు
డిల్లీలో భారత్ లో పాక్ రాయబారి అబ్దుల్ బాసిత్ జమ్మూకాశ్మీర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో వేడుకలు నిర్వహించిన సందర్భంగా అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న కాశ్మీరీల హక్కుల సాధనలో వారికి తమ దేశం ఎప్పుడూ సాయం చేస్తుందని అన్నారు. ఇలాంటి స్వాతంత్ర్యోద్యమం పూర్తి కావడానికి కొన్నేళ్లు పడుతుందని, కొన్ని సార్లు దశాబ్దాలు, తరాలు కూడా పట్టచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అదే సమయంలో భారత్ తో సత్సంబంధాల కోసం పాక్ కృషి చేస్తుందని ఆయన చెప్పారు. కాగా, గతంలో పాక్ తో చర్చలకు భారత్ సిద్ధమైన తరుణంలో కాశ్మీరీ వేర్పాటు వాడులతో చర్చలు జరిపి రెండు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం చెడగొట్టడంలో బాసిత్ ప్రముఖ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.