: జాతినుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి
స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జాతినుద్దేశించి ప్రసంగించారు. మనకు పటిష్ఠమైన రాజ్యాంగం ఉందని, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం అత్యంత విలువైనదని అన్నారు. భరత జాతి విముక్తి కోసం బ్రిటీష్ పాలకులపై పోరాడిన యోధుల ఆదర్శాల కోసం అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. మనం పాటించే విలువలతో దేశాభివృద్ధిని ప్రతిబింబించవచ్చని తెలిపారు. ఇక, పార్లమెంటులో యుద్ధ వాతావరణం కనిపించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. పార్లమెంటులో ప్రజాసమస్యలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.