: ఆ బాలీవుడ్ హీరో విడాకులు తీసుకోనున్నాడా?
బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, మెహర్ జెసియా (మాజీ మిస్ ఇండియా, సూపర్ మోడల్) విడిపోనున్నారని బాలీవుడ్ కోడైకూస్తోంది. హృతిక్ రోషన్ కు అత్యంత సన్నిహితులైన ఈ దంపతులు విడిపోనున్నారని బాలీవుడ్ వర్గాలు బాహాటంగానే చెప్పుకుంటున్నాయి. హృతిక్ దాంపత్య జీవితం ముక్కలు చెక్కలవడానికి అర్జున్ రాంపాల్ కారణమంటూ పలు కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరి దాంపత్యం ముక్కలు కావడానికి కారణం సుసాన్నే ఖాన్ (హృతిక్ మాజీ భార్య) అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరు త్వరలో విడిపోనున్నారని బాలీవుడ్ చెబుతుండగా, ఇప్పటికే విడిపోయారని మరి కొంత మంది పేర్కొంటున్నారు. కాగా, రూమర్ల సంగతేమో కానీ, స్వాతంత్ర్య వేడుకలను తాము అమెరికాలో నిర్వహించుకోనున్నట్టు అర్జున్ రాంపాల్ ట్వీట్ చేశాడు.