: నగరి మున్సిపల్ కమిషనర్ ను రాడ్ తో కొట్టిన ఛైర్ పర్సన్ కుమారుడు
చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ కమిషనర్ బాలాజీని, ఛైర్ పర్సన్ శాంతి కుమారుడు సురేష్ ఇనుపరాడ్ తో కొట్టిన ఘటన చోటుచేసుకుంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణ సందర్భంగా మున్సిపల్ స్టేడియం పరిసరాల పరిశుభ్రత విషయంలో ఏర్పడిన వివాదం దాడికి దారితీసింది. కమిషనర్ తో వాగ్వాదానికి దిగిన సురేష్ కోపోద్రిక్తుడై అక్కడే ఉన్న రాడ్ తో దాడికి పాల్పడ్డాడు. దీంతో కమిషనర్ బాలాజీ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను హుటాహుటీన స్థానిక ఆసుపత్రికి తరలించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, సురేష్ ను అదుపులోకి తీసుకున్నారు.