: స్మార్ట్ ఫోన్ ద్వారా జెండా ఎగురవేసి దేశ భక్తి చాటుకోవాలనుకుంటున్నారా?


స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని స్మార్ట్ ఫోన్ ద్వారా జెండా పండుగ చేసుకోవాలనుకునేవారికి శుభవార్త. ఇందుకోసం హైదరాబాదుకు చెందిన 'ట్రెండీ వర్క్స్ టెక్నాలజీస్' సంస్థ ఓ యాప్ ను ఆవిష్కరించింది. 'ఫ్యామిలీ యాప్: ఫ్లాగ్ హోయిస్టింగ్ ఇండియా' పేరిట రూపొందించిన ఈ యాప్ ఇన్ స్టాల్ చేసుకుని జెండా వందనం నిర్వహించుకోవచ్చని సదరు సంస్థ చెబుతోంది. వాయిస్ కమాండ్ ద్వారా పని చేసే ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి. దీనిని ఆన్ చేయగానే ఓ పోల్ కు జాతీయ జెండా కనిపిస్తుంది. యూజర్ జాతీయ గీతం పాడుతుంటే జెండా పైకి వెళ్తుంది. జైహింద్ అనగానే జాతీయ జెండా రెపరెపలాడుతుంది. పది భాషల్లో ఈ యాప్ పనిచేస్తుంది. ఇలా జెండా వందనం పూర్తి కాగానే సెల్పీ తీసుకుంటే ఫేస్ బుక్, ట్విట్టర్లో అప్ లోడ్ చేసుకునే సౌలభ్యం కూడా ఉండడం ఈ యాప్ స్పెషాలిటి అని దీని రూపకర్తలు చెబుతున్నారు. జెండా వందనం చేసుకోవాలని భావిస్తున్నారా? మరింకెందుకాలస్యం... వెంటనే ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోండి.

  • Loading...

More Telugu News