: రాజధాని నగర నిర్మాణంలో స్థానిక ప్రజల భాగస్వామ్యం అతి ముఖ్యం: చంద్రబాబు
రాజధాని నగర నిర్మాణంలో స్థానిక ప్రజల భాగస్వామ్యం అతి ముఖ్యమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం ఆధునిక, సంప్రదాయ పద్ధతులను మేళవిస్తూ జరగాలని ఆకాంక్షించారు. కొత్త రాజధాని ఉపాధి కల్పన, ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రం కావాలన్నారు. కొత్త రాజధానిలో నదికి అభిముఖంగా పర్యాటక ప్రాజెక్టులు, ఎంటర్ టైన్ మెంట్ కేంద్రాల నిర్మాణం జరగాలన్నారు. ప్రతి శుక్రవారం సీఆర్డీఏ సమావేశం నిర్వహించి, కృష్ణానది వరదనీటిని అంచనావేస్తూ ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని రహదారులు గుంటూరు, విజయవాడలను అనుసంధానిస్తూ ఉండాలని, మెరుగైన రవాణా వ్యవస్థ కోసం అత్యుత్తమ కన్సల్టెన్సీ ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రాజధాని సలహా మండలి సమావేశం ముగిసిన అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పైవిధంగా పేర్కొన్నారు.