: జగన్ దీక్ష చేస్తే డాక్టర్ల సలహా మేరకే చేస్తారు: సోమిరెడ్డి సెటైర్
వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ దీక్ష చేస్తే వైద్యుల సలహా మేరకే చేస్తారని ఎద్దేవా చేశారు. అలాంటి దొంగ దీక్షలు మానుకోవాలని జగన్ కు సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయం జగన్ కు ఏడాది తర్వాత గుర్తొచ్చిందా? అని ప్రశ్నించారు. విభజన నేపథ్యంలో, నిధులు తీసుకొచ్చే విషయంలో కేంద్రాన్ని ఒప్పించాలన్నా, మెప్పించాలన్నా చంద్రబాబుకే సాధ్యమని అన్నారు.