: కడప పెద్దదర్గాను దర్శించుకున్న సినీ నటుడు వెంకటేష్
సినీ నటుడు వెంకటేష్ కడపలోని పెద్ద దర్గాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన దర్గాకు చాదర్ ను సమర్పించారు. 18వ శతాబ్దంలో వెలసిన ఈ దర్గాను అమీన్ పూర్ దర్గా అని కూడా పిలుస్తారు. ఏపీ, తెలంగాణ ప్రాంతాల నుంచేగాక దేశవ్యాప్తంగా పలువురు భక్తులు, ప్రముఖులు దర్గాను దర్శించుకుంటుంటారు.