: ఏసీ ఎంత పని చేసింది?...పది వేల అడుగుల నుంచి విమానాన్ని దించింది!


బ్రిటిష్ ఎయిర్ వేస్ కు సంబంధించిన విమానంలో ఏసీ సరఫరాలో తలెత్తిన లోపం విమానాన్ని పది వేల అడుగుల ఎత్తు నుంచి కిందకి దించేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే... 221 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బందితో లండన్ నుంచి అమెరికాలోని సియాటెల్ కు బయల్దేరిన బ్రిటిష్ ఎయిర్ వేస్ బోయింగ్ 777 విమానం పది వేల అడుగుల ఎత్తుకు ఎగిరాక కాక్ పిట్ లో ఉన్న పైలట్లకు ఏసీ సరఫరా ఆగిపోయింది. దీంతో పైలట్లు గాలి ఆడక తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఊపిరి సలపకపోవడంతో ఎమర్జెన్సీ సమయాల్లో ఉపయోగించే ఆక్సిజన్ మాస్కులు ఉపయోగించి, గ్రౌండ్ కంట్రోల్ రూంను సంప్రదించారు. లండన్ విమానాశ్రయాధికారులు అంగీకరించడంతో విమానాన్ని వెంటనే లండన్, హీత్రూ విమానాశ్రయంలో అత్యవసరంగా దించారు. అనంతరం ఏసీ సరఫరాలో తలెత్తిన అంతరాయంపై పరీక్షించగా, కాక్ పిట్ కు ఏసీని సరఫరా చేసే రంధ్రాలు పూడుకుపోవడంతో సమస్య తలెత్తినట్టు నిపుణులు గుర్తించారు.

  • Loading...

More Telugu News