: సీఎం చంద్రబాబుపై సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో అరుణ్ కుమార్ అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ పేరుతో ఏపీ ప్రభుత్వం ఓటుకు నోటు కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్ కేంద్రంగా సీబీఐ విచారణ జరిగితే దాన్ని ఏపీ అధికారులు ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పారు. ఫిర్యాదు ఆధారంగా భవిష్యత్ లో కోర్టుకు వెళతానని న్యాయవాది తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, పాలనకు అడ్డుపడే విధంగా చంద్రబాబు ప్రభుత్వం తెలంగాణాపై అక్రమంగా వందల కేసులు పెడుతోందని, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచే కేసుల వ్యవహారం నడుపుతోందని ఆరోపించారు.