: రాహుల్ గాంధీకి షాకిచ్చిన మాజీ సైనికులు


'ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్' కోరుతూ మాజీ సైనికులు కొంతకాలంగా నిరసన ప్రదర్శనలు చేపడుతుండడం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. వారికి మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అక్కడికి వెళ్లగా, ప్రతికూల స్పందన వ్యక్తమైంది. "రాహుల్ గో బ్యాక్" అంటూ మాజీ సైనికులు నినాదాలతో హోరెత్తించారు. తమ పోరాటాన్ని రాజకీయం చేయవద్దని కోరారు. రాజకీయపరమైన మద్దతు తమకు అవసరంలేదని గట్టిగా ఎలుగెత్తడంతో రాహుల్ షాక్ తిన్నారు. నిజాయతీగా చేస్తున్న తమ నిరసనను ఫొటోలు తీసుకునేందుకు ఓ అవకాశంలా ఉపయోగించుకోవద్దని ఓ ఆందోళనకారుడు రాహుల్ కు సూచించాడు.

  • Loading...

More Telugu News