: ఉస్మానియా ఆసుపత్రిపై ఇంటాక్ నివేదిక... కూల్చివేత సరైన నిర్ణయం కాదని వెల్లడి
హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రి కూల్చివేతపై 'భారతీయ కళలు, సాంస్కృతిక వారసత్వ జాతీయ ట్రస్టు' (ఇంటాక్) నివేదిక అందించింది. ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని హెరిటేజ్ (వారసత్వ సంపద)గా గుర్తించామని తెలిపింది. అలాంటప్పుడు భవనం కూల్చివేత సరైన నిర్ణయం కాదని నివేదికలో పేర్కొంది. అయినా ఉస్మానియా పరిస్థితి మరీ దయనీయంగా లేదని, నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితికి వచ్చిందని అభిప్రాయపడింది. మరమ్మతులు చేస్తే ఆసుపత్రి మరో వందేళ్ల పాటు సేవలందిస్తుందని ఇంటాక్ వివరించింది. భాగ్యనగరానికి మకుటంగా నిలిచిన ఉస్మానియాను కాపాడుకోవాలని పేర్కొంది.