: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు నగదు ప్రోత్సాహక అవార్డులు
ప్రభుత్వ ఉద్యోగులను ప్రోత్సహించేందుకు తెలంగాణ సర్కారు తొలిసారిగా ప్రోత్సాహక అవార్డులు ప్రకటించింది. 2014-15 సంవత్సరానికి గానూ ఎంపిక చేసిన ఉద్యోగులకు అవార్డులను ఇవ్వనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అవార్డు కింద 16 మందికి రూ.20వేల ప్రోత్సాహక అవార్డు, 17 మందికి రూ.15వేల ప్రోత్సాహక అవార్డు, 13 మందికి రూ. 10వేల ప్రోత్సాహక అవార్డులు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.