: అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించిన రహానే...8 క్యాచ్ లు పట్టాడు!
శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్ లో భాగంగా గాలెలో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్ మన్ అజింక్యా రహానే అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించాడు. టెస్టు క్రికెట్ లో స్పిన్ బౌలింగ్ లో ఎక్కువ క్యాచ్ లు కీపర్ పడుతుంటాడు. అలాంటిది స్లిప్స్ లో ఫీల్డింగ్ చేసిన రహానే, రెండు ఇన్నింగ్సుల్లోను కలిపి 8 క్యాచ్ లు పట్టాడు. ఆ విధంగా, కీపర్ కాకుండా అత్యధిక క్యాచ్ లు అందుకున్న తొలి వ్యక్తిగా రహానే ప్రపంచ రికార్డు సృష్టించాడు. కాగా, రహానే పట్టిన క్యాచ్ లలో రెండో ఇన్నింగ్స్ లో సంగక్కర ఇచ్చిన క్యాచ్ ను ఎడమవైపుకు డైవ్ చేస్తూ ఒంటి చేత్తో అందుకున్న తీరు ప్రశంసనీయం.