: ఇంత చిన్న విషయానికి ఇంతమందితో రావాలా?: ప్రిన్సిపాల్ పై ఎస్సై వీరంగం


ఇటీవల కాలంలో ర్యాగింగ్ భూతం పలువురు విద్యార్థుల ప్రాణాలు పోయేందుకు కారణమవుతోంది. చాలామంది చదువు మానేసే పరిస్థితి తలెత్తుతోంది. కాలేజీలో ఏం జరిగినా అందుకు ప్రిన్సిపాల్ నే వేలెత్తి చూపుతున్నారు అత్యధిక సందర్భాల్లో! పరిస్థితి అంతదాకా తెచ్చుకోవడం అవసరమా? అని భావించిన ఓ ప్రిన్సిపాల్ కు పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ షాకిచ్చాడు. నెల్లూరు జిల్లా పల్లపాడు డైట్ కళాశాలలో ర్యాగింగ్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు. ఆయనకు మద్దతుగా 150 మంది స్టూడెంట్లు కూడా వెళ్లారు. ప్రిన్సిపాల్ అంతమందిని వెంటేసుకుని రావడం సదరు ఎస్సై గారికి రుచించలేదు. విషయం ఏంటో తెలుసుకున్న అనంతరం, ఇంత చిన్న విషయానికి ఇంతమందితో రావాలా? అంటూ ప్రిన్సిపాల్ పై మండిపడ్డాడు. ప్రిన్సిపాల్ మాట్లాడేంతలో తనదైన శైలిలో దుర్భాషలాడాడు. తమ ప్రిన్సిపాల్ ను కించపరిచే రీతిలో ఎస్సై మాట్లాడడం విద్యార్థులకు ఆగ్రహాన్ని తెప్పించింది. దాంతో, వారు ర్యాగింగ్ సమస్యను పక్కనబెట్టి, ఎస్సై తీరుకు వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. వారికి సర్దిచెప్పేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News