: బ్లాక్ బెర్రీ పోర్ష్ డిజైనర్ ఫోన్...ధర లక్ష
ఖరీదైన డిజైనర్ మొబైల్ ఫోన్లను తయారు చేసే బ్లాక్ బెర్రీ కంపెనీ మార్కెట్ లోకి కొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ప్రతి ఏటా ఒక డిజైనర్ మోడల్ ను అందుబాటులోకి తెచ్చే బ్లాక్ బెర్రీ, నాలుగో మోడల్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. బ్లాక్ బెర్రీ పోర్ష్ డిజైన్ పి 9983 పేరిట ఈ మొబైల్ ను అందుబాటులో తీసుకువచ్చింది. ఢిల్లీ, కోల్ కతా, ముంబై, చెన్నయ్ లోని ఎంపిక చేసిన బ్లాక్ బెర్రీ షోరూముల్లో దీనిని అందుబాటులో ఉంచనుంది. అలాగే ఆన్ లైన్ వ్యాపార సంస్థలు కూడా దీనిని విక్రయించనున్నాయి. దీని ధరను 99,990 రూపాయలుగా బ్లాక్ బెర్రీ సంస్థ నిర్ణయించింది. ఆన్ లైన్ లో లక్ష రూపాయలకు దీనిని విక్రయించనున్నట్టు సమాచారం. 3.1 అంగుళాల టచ్ స్క్రీన్ తో ఉండే ఈ స్మార్ట్ ఫోన్ బ్లాక్ బెర్రీ ఓఎస్ తో పనిచేయనుంది. 64 జీబీ ఇంటర్నల్ మెమరీ సామర్థ్యం కలిగిన ఈ ఫోన్ లో 128 జీబీ వరకు విస్తరించుకునే వెసులుబాటు ఉంది. 8 మెగాపిక్సెల్ రియర్, 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.