: ఆధార్ కు, ఓటర్ గుర్తింపు కార్డు అనుసంధానం ఆపేయండి: రాష్ట్రాలకు ఈసీ ఆదేశం


ఓటర్ గుర్తింపు కార్డుకు ఆధార్ అనుసంధానం చేయడాన్ని తక్షణం ఆపివేయాలని ఎలక్షన్ కమిషన్ ఈ మధ్యాహ్నం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకూ ఉత్తర్వులు పంపింది. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ ఎటువంటి అనుసంధాన ప్రక్రియ జరగరాదని ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కాగా, రేషన్, గ్యాస్ వంటి ప్రభుత్వ సబ్సిడీ డైరెక్టుగా లబ్ధిదారుని ఖాతాలోకి వెళ్లే పథకాలు మినహా మిగతా దేనికీ ఆధార్ ను తప్పనిసరి చేయకూడదని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణలో, ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ లో లక్షల మందికి రెండు ఓట్లున్నాయని చెబుతూ, వాటిని తొలగించేందుకంటూ పెద్దఎత్తున ఆధార్ అనుసంధానం జరిగింది. ఇప్పటికే 65 శాతానికి పైగా అనుసంధానం పూర్తికాగా, ఈసీ ఉత్తర్వులతో ఈ ప్రక్రియ అర్థాంతరంగా నిలిచినట్లయింది.

  • Loading...

More Telugu News