: 'వన్ ర్యాంక్ - వన్ పెన్షన్'ను తక్షణమే అమలు చేయాలి: రాహుల్ గాంధీ
'వన్ ర్యాంక్ - వన్ పెన్షన్' కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మాజీ సైనికులు చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మద్దతు తెలిపారు. దేశం కోసం పోరాడిన జవాన్లు పెన్షన్ల కోసం ఆందోళనలకు దిగాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. వన్ ర్యాంక్ - వన్ పెన్షన్ అమలు చేస్తామని ఎన్నికల్లో ప్రధాని హామీ ఇచ్చారని, తన నిర్ణయాన్ని వెంటనే ప్రకటించాలని కోరారు. తక్షణమే ఈ పథకాన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.