: శ్రీనగర్ లో పాక్ జెండా ఎగురవేసిన మహిళా వేర్పాటువాది


జమ్మూకాశ్మీర్ లో దుక్తారన్-ఇ-మిల్లత్ అనే వేర్పాటు వాద సంస్థ ఎన్నో ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ సంస్థ ప్రత్యేకత ఏంటంటే, ఇది మహిళలు నెలకొల్పిన వేర్పాటువాద గ్రూప్. ఇస్లామిజం, ఇస్లామిక్ స్త్రీవాదం, జిహాద్ ఈ గ్రూపు సిద్ధాంతాలు. దీనిని స్థాపించింది ఆసియా అంద్రాబీ అనే మహిళ. ఆమెపై పెద్ద సంఖ్యలో కేసులున్నాయి. కాగా, శుక్రవారం పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో పాక్ జెండాను శ్రీనగర్ లో ఎగురవేశారు అంద్రాబీ. ఈ మేరకు మహిళలతో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాక్ జాతీయ గీతాలాపన చేశారు.

  • Loading...

More Telugu News