: సింధు పోరాటం కూడా ముగిసింది
జకార్తా వేదికగా జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో భారత క్రీడాకారుల పోరాటం మెల్లిగా ముగుస్తోంది. బ్యాడ్మింటన్ డబుల్స్ లో గుత్తా-పొన్నప్ప జోడీ తరువాత మహిళల సింగిల్స్ లో పీవీ సింధు ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇవాళ జరిగిన క్వార్టర్ ఫైనల్ లో కొరియన్ షట్లర్ సుంగ్ చేతిలో 17-21, 21- 19, 16-21 తేడాతో సింధు పరాజయం పాలైంది. గతంలో రెండుసార్లు ఈ టోర్నీలో సింధు కాంస్య పతకం సాధించింది. కానీ ఈసారి క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగి నిరాశ పరిచింది.